చలికాలంలో శరీరం పట్టేసినట్టుంటుంది. అదే సమయంలో రక్తం చిక్కగా మారుతుంటుంది.

మీ రక్తవాహికలు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, రక్తం పలుచగా ఉండాలనుకుంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవల్సి ఉంటుంది.

విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉన్న సిట్రస్ ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది.

ఈ ఫ్రూట్స్ తినడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. నిమ్మ, ఆరెంజ్ వంటి ఫ్రూట్స్ ఇందుకు దోహదపడతాయి.

ఫ్లెక్స్ సీడ్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఇవి రక్తం చిక్కగా మారకుండా నియంత్రిస్తాయి. ఫ్లెక్స్ సీడ్స్ తినడం వల్ల రక్తం గడ్డకట్టదు. గుండెకు చాలా మంచివి.

బ్లాక్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లూ బెర్రీస్ వంటి పండ్లను రక్త వాహికలకు చాలా ప్రయోజనకరం.

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి.

బెర్రీస్ తినడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య తగ్గుతుంది. బ్లెడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంటుంది.

జైతూన్ ఆయిల్‌లో  అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఇవి కొలెస్ట్రాల్ తగ్గించేందుకు దోహదపడతాయి. రక్త వాహికల్ని ఆరోగ్యంగా మారుస్తాయి.

ఇతర ఆయిల్స్‌తో పోలిస్తే ఆలివ్ ఆయిల్ రక్త సరఫరాను మెరుగ్గా చేస్తుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్, స్ట్రోక్ సమస్య తగ్గుతుంది.