పశ్చిమోత్తానాసనం: కండరాల మీద ఒత్తిడితో పొట్ట కరుగుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. క్లోమగ్రంథి ఉత్తేజితం అవుతుంది. మలబద్దకం, గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి

వజ్రాసనం: ఊపిరితిత్తులు, పక్కటెములకు మంచి శక్తినిస్తుంది, కాలి కండరాలను బలోపేతం చేస్తుంది, థైరాయిడ్‌ గ్రంథిని ఉత్తేజం చేస్తుంది

మెడి బ్రీతింగ్: రక్తం - రక్తనాళాల శుద్ధి జరుగుతుంది, ఊపిరితిత్తుల పనిసామర్థ్యం పెరిగి వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది, ఉత్సాహం వస్తుంది

త్రికోణాసనం: నడుముకింది భాగంలో కొవ్వును కరుగుతుంది, వెన్నెముకకు బలం చేకూరుస్తుంది, పునరుత్పత్తి అవయవాలను ఉత్తేజితం చేస్తుంది

పవనముక్తాసనం: పొట్టచుట్టూ కొవ్వును తగ్గిస్తుంది, క్లోమగ్రంథిని ఉత్తేజితం చేస్తుంది, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, నడుము భాగాన్ని ఉత్తేజితం చేస్తుంది

శలభాసనం: ఈ ఆసనం వల్ల వెన్నెముక్క శక్తివంతం అవుతుంది, నడుము - పొట్టభాగంలో పేరుకున్న కొవ్వు కరుగుతుంది

సర్పాసనం: ఆస్త్మా ఉన్నవారికి చాలా మంచిది, ఊపిరితిత్తుల పని సామర్థ్యం పెరుగుతుంది, గుండె కండరాలు - వెన్నెముక కండరాలు బలపడతాయి

సర్వాంగాసనం: జుట్టు రాలడం నివారిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, మెదడుకు రక్తప్రసరణను పెంచుతుంది

హలాసనం: లివర్ - కిడ్నీలను ఉత్తేజితం చేస్తుంది, లెగ్ క్రాంప్స్‌తో బాధపడే వారికి ఇది ఊరటనిస్తుంది, రక్తప్రసరణ పెరుగుతుంది, టాక్సిన్లు బయటకి విడుదలవుతాయి

వృక్షాసనం: పాదాలు - మడమలు - మోకాళ్లు శక్తివంతమవుతాయి, ఏకాగ్రత పెరుగుతుంది