మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్ ఒకటి. ఈ క్యాన్సర్లకు హ్యూమన్ పాపిల్లోవైరస్(హెచ్‌పీవీ) కారణం అవుతుంది.
దీర్ఘకాలికంగా ఉండే హెచ్‌పీవీ వైరస్ గర్భాశక క్యాన్సర్ కణాలను అభివృద్ధికి సహాయపడుతుంది.
గర్భాశయ క్యాన్సర్లు రాకుండా తప్పనిసరిగా మహిళలు హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి.
సురక్షిత శృంగారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కండోమ్స్ వంటివి హెచ్‌పీవీ వైరస్ నుంచి రక్షించేందుకు సహయపడతాయి.
స్మోకింగ్ మానేయాలి. పొగాకు రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. పొగాకులో ఉండే విషాలు కణాల డీఎన్ఏను మార్చగలవు.
ఎక్కువగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఆహారం తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన మాంసాన్ని తీసుకోకూడదు. కొవ్వులు అధికంగా ఉండే ఆహారాన్ని తగ్గించాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఆధిక బరువు కూడా కొన్ని క్యాన్సర్లకు కారణం అవుతాయి. బ్రెస్ట్ క్యాన్సర్, పెద్ద ప్రేగు క్యాన్సర్లకు దారి తీయవచ్చు.