గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. అలాగే ఎక్కువ సేపు స్నానం చేయకూడదు. ఎక్కువ సేపు స్నానం చేయడం వల్ల చర్మం మరింత పొడిగా మారుతుంది.
శీతాకాలం చర్మాన్ని రక్షించుకోవడానికి.. హైడ్రెట్‌గా ఉండటం చాలా ముఖ్యం. ఈ కాలంలో కొంతమంది సరిపడా నీళ్లు తాగరు. రోజుకు కనీసం రెండు లీటర్ల నీరు తాగితే మన శరీరం హైడ్రెట్‌గా ఉంటుంది.
ఈ సీజన్‌లో పెదాలు పగిలిపోయే సమస్య ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో పెదవులు పగిలిపోయే సమస్యను అధిగమించాలంటే తప్పనిసరిగా లిప్ బామ్ వాడాలి.
చలికాలం వీలైనంత వరకూ తాజాగా, అప్పుడే వండిన ఆహారాన్ని తీసుకోవాలి. ఈ సీజన్ లో చల్లబడిన ఆహారం తీసుకుంటే దాన్ని అరిగించడం శరీరానికి కష్టమవుతుంది. తాజా ఆహారం తీసుకుంటే చర్మం కూడా తాజాగా ఉంటుంది.
శీతాకాలంలో కూడా సూర్యుని హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. UV కిరణాల నుండి చర్మాన్ని రక్షించడానికి ప్రతిరోజూ అధిక సన్‌స్క్రీన్‌ను అప్లై చేయండి. శీతాకాలపు సూర్యరశ్మి తక్కువగా ఉండటం కూడా చర్మానికి హానికరం.
చలి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు స్వెటర్ తోపాటుగా కాళ్లకు సాక్స్, చేతులకు గ్లౌజులు ధరించాలి. బయటికి వెళ్లినప్పుడు ముఖానికి స్కార్ఫ్ కట్టుకోవాలి. ఇలాంటి జాగ్రత్తల వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది
చలి కాలంలో ఉండే హ్యుమిడిటీ లెవెల్స్, తక్కువ టెంపరేచర్ వలన చాలా రకాల చర్మ సమస్యలు వస్తాయి. మీ చర్మాన్ని రక్షించుకోవడానికి.. కొన్ని న్యాచురల్ మాస్కులు ట్రై చేయండి. క్లే మాస్క్ వేసుకుంటే.. మీ చర్మానికి మేలు జరుగుతుంది.
ఒకరోజులో ఎక్కువ సార్లు ముఖాన్ని కడగడం మానేయాలి. రోజులో రెండుసార్లు కడిగితే సరిపోతుంది. చర్మాన్ని తేమగా చేసేందుకు మాయిశ్చరైజర్ వాడటం మంచిది.