శీతాకాలంలో చంటిపిల్లల వ్యాధి నిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంది. దీంతో వైరల్ వ్యాధులకు లక్ష్యంగా మారుతారు. 

పసి పిల్లలు పెద్దవారి కన్నా త్వరగా శరీర ఉష్ణోగ్రతను కోల్పోతారు. 

గది ఉష్ణోగ్రత 24-26 డిగ్రీలు ఉండేలా చూసుకోవాలి.  

గదిలో హీటర్లు వాడితే తేమ తగ్గుతుంది. అందుకనే తేమ కూడా సరైన విధంగా ఉండేలా చూసుకోవాలి. 

శిశువు శరీరం సున్నితంగా ఉంటుంది కాబట్టి.. చర్మం పొడిగా మారుకుండా మాయిశ్చరైజర్ వాడాలి.

 వ్యాక్సినేషన్ క్రమం తప్పకుండా వేయించాలి. ఇది శిశువును అంటువ్యాధుల నుంచి రక్షిస్తాయి.

తల్లిపాలు ఇవ్వాలి. ఇందులో ఉండే యాంటీబాడీలు, పోషకాలు శిశువు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. 

పరిశుభ్రత పాటించాలి. చంటి పిల్లలను తాకెటప్పుడు ప్రతీసారి చేతులు కడుక్కోవాలి.