నిద్ర టైంలో ఎలాంటి దుస్తులు ధరించాలి..?

సాధారణంగా బయటకు వెళ్లేటప్పుడు మహిళలు ఎన్నో రకాల మోడర్న్ దుస్తులు ధరిస్తారు.

పగలు టైట్ ఫిట్ లెగ్గిన్స్, జీన్స్ లాంటివి ధరిస్తారు.

అలాంటివి రాత్రి వేసుకుంటే అసౌక్యరంగా ఉంటుంది.

రాత్రిపూట ఎలాంటి దుస్తులు ధరిస్తే సౌకర్యంగా ఉంటుందో చూద్దాం.

బిగుతుగా ఉండే దుస్తులు ధరించినట్లయితే చర్మంపై అచ్చులు పడడం, చర్మం ఎరుపుగా మారటం, ఎలర్జీ, దురదలు వస్తాయి. 

వీటితో పాటు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండటంతో పాటు, రక్తప్రసరణ సరిగ్గా జరగదు.

కాటన్ దుస్తులు ధరించడం వలన రాత్రి సమయంలో నిద్రలో ఎటువంటి ఇబ్బంది ఉండదు

మంచి రక్తప్రసరణ జరిగి సుఖవంతమైన నిద్రపడుతుంది.