చలికాలంలో చర్మం పగుళ్లకు అనేక కారణాలు ఉన్నాయి..
చలి, పొడి గాలుల కారణంగా చర్మం తేమ తగ్గుతుంది..
చలికాలంలో వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మంలోని సహజ తేమ తొలగిపోతుంది.
చల్లని వాతావరణంలో ప్రజలు తక్కువగా నీటిని తాగుతారు.. దీని కారణంగా చర్మం డీహైడ్రేట్ అవుతుంది.
పొడి చర్మంపై కఠినమైన రసాయనాలను ఉపయోగించడం వల్ల చర్మం మరింత దెబ్బ తింటుంది.
విటమిన్ ఎ, సి, డి, ఇ లోపం వల్ల చర్మం పగుళ్లు ఏర్పడుతాయి.
చల్లని గాలి చర్మం నుండి తేమను పీల్చుకుంటుంది. దీంతో.. చర్మం పొడిగా, బలహీనంగా మారుతుంది.
మాయిశ్చరైజర్‌ను రెగ్యులర్‌గా ఉపయోగించకపోవడం వల్ల చర్మం త్వరగా పొడిబారుతుంది.