జుట్టు ఆడవారిలోనే కాదు మగవారికీ అందాన్ని చేకూరుస్తాయి. కురులు తెల్లగా ఉంటే వయస్సు మళ్లిన వారిలా కనిపిస్తారు. ఇక తెల్లగా ఉన్న వెంట్రుకలను మార్చుకోవాలనుకుంటున్నారా..

చాలా మందికి చిన్నతనం నుంచే తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి. కురులలో మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల వెంట్రుకలు తెల్లగా మారతాయి.

చిన్న వయస్సులోనే జుట్టు తెల్లగా మారడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఒత్తిడి, రెండోది పోషకాహార లోపం.

ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యం చేయకుండా తగిన పోషకాలను తీసుకోవాలి. అప్పుడే మన జుట్టు కుదుళ్లలో ఈ మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. 

కొన్ని సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా కూడా ఈ తెల్ల జుట్టు సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు. 

మీరు తినే ఆహారంలో ప్రతీరోజూ కాల్షియం, విటమిన్ బీ5గా పిలవబడే ఫాంటోథెనిక్ ఆమ్లంను తీసుకోవాలి.

వైద్యుల సూచన తీసుకుని.. ప్రతి రోజూ కూడా 100-200 మిల్లీగ్రాముల కాల్షియం, ఫాంటోథెనిక్ ఆమ్లం తీసుకోవడం ద్వారా ఈ తెల్ల జుట్టు సమస్యను చాలా ఈజీగా అధిగమించవచ్చు.

ఈ సప్లిమెంట్లను ఇష్టానుసారం తీసుకోకూడదు. వైద్యులు సూచించే బ్రాండ్లు, మోతాదుల ప్రకారమే తీసుకోవాలి.