మనం పడుకునే భంగిమ మన స్వభావాన్ని ఇట్టే అర్థమయ్యేటట్టు చెబుతుంది. నిద్రపోయేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా పడుకోవడం అలవాటు ఉంటుంది.
కొందరు బోర్లా పడుకుంటే, కొందరు వెల్లకిలా పడుకుంటారు. కొందరు ఒక పక్కకు తిరిగి ఒద్దికగా పడుకుంటే కొందరు ముడుచుకొని పడుకుంటారు.
అయితే పడుకునే భంగిమను బట్టి వాళ్ళ స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చని, వాళ్ల వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చని అనేక అధ్యయనాలు తేల్చాయి.
కాళ్ళు చేతులు బార్లా చాపి వెల్లకిలా పడుకునే వారు నలుగురిలో ప్రత్యేకమైన గుర్తింపు కోరుకునే వ్యక్తులు అని చెబుతున్నారు. అంతేకాదు వారు స్వేచ్ఛా ప్రియులని, ఎవరిపైనా ఆధారపడే వ్యక్తులు కాదని చెబుతున్నారు.
రెండు చేతులు తలగడగా బోర్లా పడుకుంటే అటువంటి వ్యక్తులు చాలా సంకుచిత స్వభావం ఉన్న వ్యక్తులని చెబుతున్నారు.
రెండు చేతులు తలగడగా బోర్లా పడుకునే వారు అవసరం ఉంటేనే మాట కలిపే మనస్తత్వం ఉన్న వారుగా ఉంటారని, ఎలాంటి లక్ష్యం లేకుండా జీవిస్తారని, అలసత్వం వారి లక్షణం అని చెబుతున్నారు.
కుడిచేతిని తలగడ పెట్టుకొని కుడివైపుకు తిరిగి పడుకునే వాళ్లలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందని, వారు అన్ని పనుల్లో విజయం సాధిస్తారని చెబుతున్నారు.
కుడిచేతిని తలగడ పెట్టుకొనే వారు భిన్నమైన దారిలో వెళ్లడానికి ప్రయత్నిస్తారని, అధికారాన్ని, సంపదను పొందుతారని చెబుతున్నారు.
ఎడమ చేతిని తలకింద పెట్టుకుని ఎడమవైపు తిరిగి పడుకుంటే వారికి ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. వారిలో మంచితనం ఉంటుంది.
ఎడమ చేతిని తలకింద పెట్టుకుని వారికి పెద్దలంటే ఎనలేని గౌరవం ఉంటుందని, పనిలో నిబద్ధత ఉంటుందని చెబుతున్నారు.
ఇక పక్కకు తిరిగి ఒకే కాలు ముడుచుకుని పడుకునే వారికి అసంతృప్తి ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
ఒకే కాలు ముడుచుకుని పడుకునే వారు కష్టపడి పనిచేసే స్వభావం ఉన్న వాళ్లుగా ఉంటారని, చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా బాధ పడతారు అని చెబుతున్నారు.
ఇక ఒక పక్కకు తిరిగి రెండు కాళ్ళు ముడుచుకుని పడుకునే వారిలో మంచి స్వభావం ఉండదని చెబుతున్నారు.
రెండు కాళ్ళు ముడుచుకుని పడుకునే వారిలో స్వార్థం ఎక్కువగా ఉంటుందని అసూయ, ప్రతీకారాలు ఉంటాయని చెబుతున్నారు. ఎవరైనా సరే వీళ్ళకు భయపడి దూరంగా పారిపోతారని చెబుతున్నారు.