మండే ఎండల్లో కాసేపు బయటకు వెళ్లినా మన శరీరానికి చాలా సమస్యలు వస్తుంటాయి.
వేసవి కాలంలో ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ అవసరం.
ఎండాకాలంలో ఉండే వేడి వాతావరణానికి తగ్గట్టుగా మన ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఎండాకాలంలో జీలకర్ర వాడకాన్ని పెంచడం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది.
మజ్జిగలో జీలకర్ర పొడిని కలుపుకొని తాగితే జీర్ణ సమస్యలు తొలగిపోవడంతో పాటు శరీరం చల్లబడుతుంది.
ఎండాకాలంలో ఉష్ణోగ్రతలను మన శరీరం తట్టుకోవడం కోసం చెమటను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంటుంది.
దీని వల్ల శరీరంలో మనం వివిధ రూపాల్లో తీసుకునే నీటి శాతంలో అధిక భాగం చమటను ఉత్పత్తి చేయడానికి ఖర్చు అవుతుంది.
డీహైడ్రేషన్‌కు లోనవడం చేత మెంతులను నీటిలో నానబెట్టి, ఆ నీటిని తాగితే డీహైడ్రేషన్ నుంచి కాపాడుకోవచ్చు.