మహిళల రక్షణ కోసం కేంద్ర సర్కారు నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చింది. నిర్భయ అంటే మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తున్న చట్టం. 

2013లో ఢిల్లీ ఓ యువతిపై సామూహిక లైంగిడి జరగగా.. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

దేశవ్యాప్తంగా మహిళల భద్రతపై విమర్శలు వెల్లువెత్తగా.. ఆ సమయంలో కేంద్ర ప్రవేశపెట్టిందే ఈ నిర్భయ చట్టం-2013. 

 2013 మార్చి 19న లోక్‌సభలో, మార్చి 21న రాజ్యసభలో ఈ చట్టం ఆమోదం పొందింది. 

అప్పటి నుంచి మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించినా, అవమానించినా, వారి మనోభావం దెబ్బతినేలా ప్రవర్తించినా నిర్భయ-2013 చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలనేదే ప్రధాన ఉద్దేశం.

నిర్భయ- 2013 చట్టంలో ప్రధానంగా ఐపీసీ 354 సెక్షన్‌ ప్రకారం కేసు నమోదు చేయబడుతుంది.

నిర్భయచట్టం ఆమోదానికి ముందు ఐపీసీ 354 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తయిన తర్వాత విచారణ అనంతరం నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించి కోర్టుకు పంపించేవారు.

ఢిల్లీ ఘటన తర్వాత ఐపీసీ 354 సెక్షన్‌లో చేర్పులు చేశారు. మహిళలను వేధించడంతోపాటు వారిపై ప్రవర్తించే ప్రతి అంశానికో సెక్షన్‌ కింద కేసు నమోదు చేసేందుకు వీలుగా మార్పులు చేశారు.

మహిళలపై దౌర్జన్యం చేయడం, వారిని అవమానించడం, వారిపై బలప్రయోగం చేస్తే ఐపీసీ 354 సెక్షన్‌ కింద నేరం.

ఐపీసీ354/సీ: మహిళల రహస్య, వ్యక్తిగత చర్యలను చూడడం, అలాంటి వాటిని ఫొటోలు తీయడం కూడా నిర్భయ-2013 చట్టం కింద నేరమే.

ఐపీసీ 354/ఎ : మహిళలను లైంగికంగా వేధించడంతోపాటు భౌతికంగా వేధిస్తూ శరీరానికి తాకడం.

ఐపీసీ 354/బీ: ఒంటిపై బట్టలులాగి వేధించడం, బలప్రయోగంగా వివస్త్రను చేసి అవమానించడం.

ఐపీసీ354/డీ: మహిళలను వేధించడంతోపాటు వారిని వెంబడించడం, వారితో చనువుగా ఉండేందుకు ప్రయత్నించినా నేరమే.

సోషల్‌మీడియా, సెల్‌ ఫోన్‌లతో ఇబ్బందిపెడుతూ అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టి లోబర్చుకునేందుకు ప్రయత్నించినా నిర్భయచట్టం ప్రకారం నేరస్తులే.