దసరా రోజు పాలపిట్టకనిపిస్తే శుభసూచికంగా భావిస్తారు.
అందుకే శమీ పూజ అనంతరం పాల పిట్టను చూసేందుకు ప్రజలు తహతహలాడుతారు.
నీలం, పసుపు రంగుల కలబోతలో ఉండే పాలపిట్ట చూసేందుకు ఎంతో అందంగా ఉంటుంది.
పాలపిట్ట మనశ్శాంతికి, ప్రశాంతతకు, కార్యసిద్ధికి సంకేతంగా భావిస్తారు.
చాలామంది ఈ పక్షిని పరమేశ్వరుడి స్వరూపంగా భావిస్తుంటారు.
అందుకే దసరా పండుగ రోజు పాలపిట్టను చూస్తే అన్ని శుభాలే జరుగుతాయని నమ్ముతుంటారు.
పురాణాలు, సాంస్కృతిక పరంగా పాలపిట్టకు ప్రాధాన్యం ఉంది
అందుకే పాలపిట్టను మన రాష్ట్ర పక్షిగా గుర్తించి గౌరవం ఇచ్చుకున్నాం.
తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, బిహార్ రాష్ట్రాల అధికార పక్షి కూడా పాలపిట్టనే.