స్త్రీలే కాదు ఎందరో పురుషులు సైతం హెయిర్ ఫాల్ సమస్యతో తీవ్రంగా సతమతం అవుతున్నారు.

ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, ధూమపానం, మద్యపానం, ఒత్తిడి, కాలుష్యం, కంటి నిండా నిద్ర లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు

జుట్టు రాలే కొద్ది పురుషుల్లో టైసన్ పెరిగిపోతూ ఉంటుంది. ఎక్కడ బట్టతల వచ్చేస్తుందో అని బెంగ పెట్టుకుంటారు. 

ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే హెయిర్ ఫాల్ చాలా వేగంగా కంట్రోల్ అవుతుంది. అదే సమయంలో మీ జుట్టు ఒత్తుగా సైతం పెరుగుతుంది. 

రెండు ఎగ్స్ తీసుకుని అందులో గుడ్డు పచ్చ సొన వేసుకోవాలి. అలాగే రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, వన్ టేబుల్ స్పూన్ ఆముదం, రెండు టేబుల్ స్పూన్లు ఉసిరికాయ పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.  

తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి. 

గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్న పురుషులు వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ రెమెడీని పాటించాలి. తద్వారా కుదుళ్ళు సూపర్ స్ట్రాంగ్ గా మారతాయి.

 జుట్టు రాలడం క్రమంగా కంట్రోల్ అవుతుంది. అదే సమయంలో జుట్టు ఒత్తుగా సైతం పెరుగుతుంది. పైగా ఈ రెమెడీని పాటిస్తే జుట్టు త్వరగా తెల్లబడకుండా కూడా ఉంటుంది. 

కాబట్టి జుట్టు రాలిపోతుందని సతమతం అవుతున్న పురుషులు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి. మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.