వ్యక్తిగత పరిశుభ్రత పట్ల శ్రద్ధ చూపాలి. బయటికి వెళ్లి వచ్చిన వెంటనే, భోజనానికి ముందు, మల, మూత్ర విసర్జన తర్వాత కాళ్లు, చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
రోగ నిరోధక శక్తి పెరగడానికి ఆహారపు అలవాట్లతోపాటు వ్యాయామం, తగినంత నిద్ర కూడా చాలా అవసరం.
రోజుకు కనీసం 40 నిమిషాల చొప్పున వారంలో 5 రోజులు వ్యాయామం చేయడం మంచిది.
నడకకు వెళ్లే వాళ్లు రోజుకు కనీసం ఏడు వేల నుంచి ఎనిమిది వేల అడుగులు వేయాలి.
డెస్క్ ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు గంటకు ఒక్కసారైనా కూర్చున్న చోటు నుంచి లేచి, కొంచెం దూరం నడవాలి.
60 ఏళ్లు దాటినవాళ్లు స్కిప్పింగ్ చేయలేని పరిస్థితుల్లో సైక్లింగ్ చేయవచ్చు.
స్కిప్పింగ్ వల్ల కాళ్ల కండరాలు, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
వయసులో ఉన్నవాళ్లయితే జాగింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ చేయడం ఉత్తమం. లేదంటే శారీరక, మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే ఏవైనా క్రీడలు ఆడాలి.
యోగా చేస్తే శరీరం ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ప్రాణాయామం వల్ల మెదడు, ఇతర అవయవాలకు తగినంత ఆక్సిజన్ అందుతుంది.