భార్యాభర్తల అనుబంధం హ్యాపీగా ఉండాలంటే ఇద్దరు కూడా ముందుగానే ఎదుటివారు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో గుర్తించి వాటిని తీర్చాలి. 

 ముఖ్యంగా రిలేషన్‌లో భార్యలు భర్తల దగ్గర్నుంచి కొన్ని బేసిక్ అవసరాలని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. 

వాటిని గనుక భర్త గుర్తించి ఫాలో అయితే వారి బంధం అన్యోన్య దాంపత్యమే. మరి అవేంటంటే..

భార్యలు భర్తల నుంచి ఆశించేది కేరింగ్. వారి భర్త కచ్చితంగా తనని కేరింగ్‌గా చూసుకోవాలి.

 ప్రతి భర్త కూడా ఏ విషయాన్నైనా తమ దగ్గర నిజాయితీగానే ఉండాలని భార్యలు కోరుకుంటారు.  ప్రతి విషయాన్ని భర్తలు అర్థం చేసుకోవాలని భార్యలు కోరుకుంటారు.

  గౌరవం.. రిలేషన్‌లో ఇది కూడా చాలా ముఖ్యం. భార్యలు ఇంట్లో ఎన్ని జరిగినా భరిస్తారు. కానీ, వారి విషయాలు పదిమందిలో చెప్పి బాధపెడితే మాత్రం సహించలేరు. 

 ప్రతి భార్య కూడా తమ భర్త సపోర్ట్ కోరుతుంది. 

ఇంటిబాధ్యతలు, ఉద్యోగం వంటి బాధ్యతల్ని సక్రమంగా బ్యాలెన్స్ చేయలేనప్పుడు భర్త చొరవ తీసుకోవాలి.