భోజనం తిన్నాక వెంటనే నీళ్లు ఎందుకు తాగకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆయుర్వేదం ప్రకారం.. భోజనం తర్వాత శరీరంలో చేరిన నీరు జీర్ణ ఎంజైములను పల్చగా మారుస్తుంది. దీనివల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది.

దీనివల్ల జీర్ణక్రియ సవ్యంగా సాగదు. అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. ఇది నిజమేనని సైన్స్ కూడా చెబుతోంది.

ఆహారాన్ని జీర్ణం చేయడానికి, జీర్ణవ్యవస్థ తీసుకునే సహజ సమయాన్ని నీరు తాగడం ద్వారా మార్చేస్తున్నట్టే లెక్క. దీంతో కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా వస్తాయి.

భోజనం తిన్న వెంటనే నీరు తాగితే బరువు త్వరగా పెరుగుతారని, ఊబకాయం బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

గుండెల్లో మంట కూడా రావచ్చు. ఆహారం తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణం కాకుండా ఆహారం చాలా వరకు మిగిలిపోతుంది.

మధుమేహం ఉన్నవారు భోజనం తిన్న వెంటనే నీటిని తాగకూడదు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.

భోజనం తినడానికి అరగంట ముందు, భోజనం తిన్న అరగంట తర్వాత నీరు తాగడం ఉత్తమం.

అలాగే భోజనం తినేటప్పుడు కెఫీన్ నిండిన పానీయాలు, కూల్ డ్రింకులు కూడా తాగడం మానేయాలి.