ఒంటరిగా ట్రావెల్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. సోలోగా ట్రావెల్ చేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకుంటారు
ఇప్పుడున్న జనరేషన్‌లో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఒంటరిగా ట్రావెల్ చేస్తున్నారు.
ముందుగానే మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో ప్రణాళిక వేసుకోవడం చాలా ముఖ్యం.
ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఎక్కువగా లగేజ్ తీసుకెళ్లవద్దు. సామాన్లు ఎక్కువగా ఉండటం వల్ల ఎంజాయ్ చేయలేరు.
కొత్త ప్రదేశాలకు వెళ్లేటప్పుడు అనారోగ్యానికి గురవుతుంటారు. విరేచనాలు, వాంతులు, జ్వరానికి సంబంధించిన మందులను పట్టుకోండి.
సోలో ట్రావెలింగ్‌లో బోర్ కొడితే ఎవరితో పడితే వాళ్లతో మాట్లాడకండి.
మీ వివరాలు అన్ని అడిగితే అసలు చెప్పవద్దు. మీతో సన్నిహితంగా ఉండి మీ వస్తువులను దొంగలించవచ్చు.
మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో కుటుంబ సభ్యులకు ముందుగానే తెలియజేయండి.
ఎక్కడ ఉన్నారు, ఏ ప్రదేశానికి వెళ్తున్నారో, ప్రతి విషయాన్ని కూడా చెప్పండి. అప్పుడు వాళ్లకు ఆందోళన ఉండదు.
క్యాబ్ బుక్ చేసుకోవడం వంటివి కాకుండా ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడండి. సేవ్ చేయడానికి ఎవరో ఒకరు ఉంటారు.