నడక మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎందుకంటే ఇది ఎన్నో అనారోగ్య సమస్యలు రాకుండా మనల్ని కాపాడుతుంది.

నడక ఎన్నో సమస్యలు నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది. అందుకే రోజూ తప్పకుండా నడవాలని నిపుణులు చెబుతున్నారు.

భోజనం చేసిన తర్వాత కాసేపు నడవడం వల్ల  జీర్ణక్రియ బాగా పనిచేస్తుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

తిన్న తర్వాత 15 నిమిషాలు నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇది టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యలను నివారించడానికి కూడా సహాయపడుతుంది. 

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి నడక ఎలా సహాయపడుతుందో తెలుసుకునేందుకు ఏడు అధ్యయనాల ఫలితాలను పరిశోధకులు ఇటీవల పరిశీలించారు.

స్పోర్ట్స్ మెడిసిన్ జర్నల్ లో ఇటీవల ప్రచురితమైన మెటా అనాలిసిస్ లో ఈ పరిశోధనలు ప్రచురితమయ్యాయి. 

భోజనం తర్వాత రెండు నుంచి ఐదు నిమిషాలు తేలికపాటి నడక రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనం కనుగొంది.

తిన్నతర్వాత  కొన్ని నిమిషాల పాటు నడిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గినట్టు పరిశోధకులు కనుగొన్నారు. 

నడక వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గడమే కాదు.. అలసట, కేలరీలు తగ్గుతాయి. 

నడక వల్ల శరీరం శక్తి వంతంగా మారుతుంది. గుండె ఫిట్ గా, ఆరోగ్యంగా.. ఎముకలు బలంగా అవుతాయి.