మనలో చాలామందికి ఉదయం లేవగానే చేతులు రుద్దుకొని, కళ్లకు అద్దుకునే అలవాటు ఉంటుంది.
అలా చేయడానికి గల కారణం ఏంటి..? దాని వల్ల ఏమైనా లాభాలున్నాయా..? అంటే.. ఉన్నాయనే చెప్పొచ్చు.
మనలో చాలామందికి ఉదయం లేవగానే చేతులు రుద్దుకొని, కళ్లకు అద్దుకునే అలవాటు ఉంటుంది.
బ్రహ్మ దేవుడు గీసిన ఆ గీతలను పొద్దున్నే చూస్తే ఆ రోజు మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు.
ఇదంతా పక్కన పెడితే దీనివల్ల సైంటిఫిక్ బెనిఫిట్స్ ఉన్నాయి.
నిద్రపోయినప్పుడు.. మన శరీరంలోని పలు అవయవాలు విశ్రాంతి దశలోకి వెళతాయి. దీని వల్ల శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది.
ఉదయం లేవగానే రెండు చేతులు రుద్దుకోవడం వల్ల శరీరంలో మళ్లీ ఉష్ణోగ్రత పెరుగుతుంది.
అవే చేతులను కళ్లకు అద్దుకోవడం వల్ల శరీరం మొత్తం వేడి వ్యాపిస్తుందట.
అలా మళ్లీ మన బాడీ యాక్టివ్ అవుతుంది.