చిలగడదుంపలు
తీపి బంగాళాదుంపలలో బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్, పొటాషియం మరియు విటమిన్ సి అధికంగా ఉంటాయి.
క్యారెట్లు
క్యారెట్లు విటమిన్-ఏకి మంచి సోర్స్. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, పొటాషియం కూడా పుష్కలంగా ఉంటాయి.
పాలకూర
పాలకూర అనేది విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే ఆకు కూర.
లివర్.
మనం తీసుకునే మాంసాహారంలో లివర్‌ను యాడ్ చేసుకోండి. లివర్‌లో విటమిన్-ఏ సమృద్ధిగా ఉంటుంది. దీంతో పాటు విటమిన్ B12 లభ్యం అవుతుంది.
మామిడికాయలు
వేసవిలో దొరికే మామిడి పండ్లు విటమిన్-ఏకి బెస్ట్ ఛాయిస్. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
రెడ్ బెల్ పెప్పర్స్
రెడ్ బెల్ పెప్పర్స్ విటమిన్ ఎ, విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
కాడ్ లివర్ ఆయిల్
కాడ్ లివర్ ఆయిల్ విటమిన్ ఎ, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలలో సమృద్ధిగా ఉండే సప్లిమెంట్. ట్యూనా, సాల్మన్, మాకేరెల్, హెర్రింగ్ మొదలైన చేపల నుంచి కాడ్ లివర్ ఆయిల్ సేకరిస్తారు.
బొప్పాయి
బొప్పాయి ఒక ఉష్ణమండల పండు, ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.