ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 71వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు

దాదాపు 1000 రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ సెంచరీ చేశాడు

అత్యధిక సెంచరీల జాబితాలో పాంటింగ్ సరసన కోహ్లీ నిలిచాడు. సచిన్ (100) తొలి స్థానంలో ఉన్నాడు.

71వ సెంచరీని సచిన్ 523వ ఇన్నింగ్స్‌లలో చేస్తే.. కోహ్లీ 522 ఇన్నింగ్స్‌లలోనే పూర్తి చేశాడు

తాజా సెంచరీతో కోహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 24వేల పరుగులు చేశాడు. 

ఇండియా తరఫున సచిన్, కోహ్లీ, ద్రవిడ్ మాత్రమే 24వేల పరుగులు చేశారు

అంతర్జాతీయ టీ20లలో 3,500 పరుగులు చేసిన రెండో భారత క్రికెటర్ కోహ్లీ. గతంలో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. 

ఓవరాల్ టీ20లలో కోహ్లీకి ఇది ఆరో సెంచరీ.. ఐపీఎల్‌లో ఐదు సెంచరీలు చేశాడు.

అన్ని ఫార్మాట్లలోనూ సెంచరీ చేసిన నాలుగో క్రికెటర్ కోహ్లీ.. గతంలో రోహిత్, రైనా, రాహుల్ ఈ జాబితాలో చేరారు

అంతర్జాతీయ టీ20లలో భారత్ తరఫున కోహ్లీ (122)దే అత్యధిక స్కోరు. రోహిత్ (118) రికార్డును అధిగమించాడు