ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిధిని వినాయక చవితిగా జరుపుకుంటారు

హిందూ పంచాంగం ప్రకారం సెప్టెంబర్ 7న  విగ్రహ ప్రతిష్ఠాపనకు అనువైన సమయం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:34 వరకు ఉంటుంది

వినాయక చవితి రోజున ఆచారాల ప్రకారం గణేశుడిని ఇంట్లో ఈశాన్య మూలలో ప్రతిష్టించండి. ఈ దిశలో వినాయకుడిని పూజించడం శుభప్రదం

గణేషుడిని ఎరుపు రంగు వస్త్రం మీద ప్రతిష్టించి ఎరుపు రంగు దుస్తులు ధరింపజేయండి

గణేశుని ఆరాధనలో దర్భ గడ్డి, పూలు, పండ్లు, దీపాలు, అగరుబత్తీలు, గంధం, కుంకుమ వినాయకుడికి ఇష్టమైన లడ్డూలు, మోదకాలు సమర్పించండి.

గణపతి ఆరాధనలో “ఓం గం గణపతయే నమః” అని పాటించండి.

వినాయక చవితి రోజున ఉపవాసం, పూజలు చేసే వ్యక్తి శరీరం, మనస్సులో స్వచ్ఛంగా ఉండాలి. బ్రహ్మచర్యాన్ని అనుసరించాలి

పూజ కోసం శుభ్రమైన, నిశ్శబ్ద ప్రదేశంలో పీటాన్ని ఏర్పాటు చేసి గణేశుడి విగ్రహం ప్రతిష్టించండి

ఆ తర్వాత వినాయకుడిని కుంకుమ, చందనం, పూలతో అలంకరించాలి.

వినాయకుడికి కుడుములు, ఉండ్రాళ్ళు, పండ్లు సమర్పించండి. 

పూజ ముగింపులో గణపతికి హారతి ఇచ్చి "ఓం గం గణపతయే నమః" అనే మంత్రాన్ని పఠించండి.