విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ప్రేమాయణం నడుస్తోందని వార్తలు గుప్పుమంటున్న విషయం విదితమే

ఇక నిత్యం వార్తల్లో ఉండే ఈ జంట ప్రస్తుతం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తుందని తెలుస్తోంది

నిన్ననే ఈ జంట ముంబై ఎయిర్ పోర్టులో మాల్దీవులకు పయనమవుతూ విడివిడిగా కెమెరాకంట పడ్డారు

జంటగా కనిపించకపోవడంతో యాదృచ్ఛికమేమో అనుకున్నారు.. కానీ ఇద్దరు మాల్దీవుల్లోనే జంటగా ఉన్నారని తెలిసిపోయింది

మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ రష్మిక సోషల్ మీడియా లో పోస్ట్లు పెడుతూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది

ఈ ఫొటోలో రష్మిక విజయ్ పెట్టుకున్న గాగుల్స్ తో కనిపించింది

లైగర్ టైమ్ నుంచి విజయ్ ఇవే గాగుల్స్ తో కనిపిస్తూ వస్తున్నాడు

మాల్దీవుల్లో రష్మిక ఆ గాగుల్స్ తో కనిపించేసరికి వీరు జంటగానే మాల్దీవులకు వెళ్లిన మాట వాస్తవమే అని అంటున్నారు

నిప్పులేనిదే పొగ రాదు అన్నట్లు వీరి మధ్య ప్రేమాయణం నడుస్తోంది అని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలని నెటిజన్లు అంటున్నారు