వాము..మనం ఇంట్లో ఉపయోగించే పదార్థం. అయితే వామును మనం అన్ని రకాల వంటకాలలో ఉపయోగించము, కేవలం కొన్ని పదార్థాలలో మాత్రమే వామును ఉపయోగిస్తాం.

వామును మన రోజువారి ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు సమకూరుతాయి. జీలకర్ర మాదిరిగానే గింజల రూపంలో ఉండే వాము మంచి సువాసన వెదజల్లుతూ, నమిలి తిన్నప్పుడు ఘాటుగా ఉంటూ మనకు మంచి ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది.

వాములో నియాసిన్, థియామిన్, కాల్షియం పొటాషియం ఫాస్ఫరస్ విటమిన్లు ఖనిజాలు, ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి.

వామును నేరుగా నమలి తినడం, వాము నీటిని ప్రతి రోజు తాగడం వల్ల కూడా మన ఆరోగ్యానికి మంచింది. వామును మనం ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకోవడంతో మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.  గుండె జబ్బులతో పాటు వివిధ దీర్ఘకాలిక సమస్యలను వాము తగ్గిస్తుంది.

వామును మనం ప్రతినిత్యం తీసుకోవడం కారణంగా మన రక్తపోటును నియంత్రించడానికి అది బాగా సహాయపడుతుంది. వాము మన గుండె కణాలు, రక్తనాళాలలోకి క్యాల్షియం చేరకుండా అడ్డుకొని రక్త పోటును బాగా తగ్గిస్తుంది. 

వాములో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రో బయల్ గుణాలు ఆర్థరైటిస్ సమస్యలను తగ్గిస్తాయి .వామును తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఆస్తమాతో బాధపడే వారికి కూడా వాము ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇక జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి వాము దివ్య ఔషధంగా చెప్పాలి. 

అజీర్ణం, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారు వాము తింటే ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వాము కడుపునొప్పికి కూడా బాగా పనిచేస్తుంది. 

మహిళలకు పీరియడ్స్ టైం లో విపరీతమైన కడుపునొప్పి, నడుము నొప్పిని తగ్గించడానికి వాము ఉపయోగపడుతుంది.

శరీరంలో దీర్ఘకాలికంగా ఉన్న వాపులు, నొప్పులు తగ్గడానికి కూడా వాము బాగా ఉపయోగపడుతుంది. వాములో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, చాలామంది పదేపదే వామును తింటూ ఉంటారు. అయితే ఇది మాత్రం మంచిది కాదని చెబుతున్నారు.

ఏదైనా మితంగా తీసుకున్నప్పుడే దాని ప్రయోజనాలు మనకు తెలుస్తాయి అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా తీసుకుంటే ప్రతికూలమైన ప్రభావాలు పడే అవకాశం ఉంటుంది.