ప్రేమ పక్షులకు ఫిబ్రవరి నెల ఒక ఆనంద కోలాహలం. ప్రేయసి కోసం తపించే వారికి, కొత్తగా ప్రేమ గూటికి చేరాలనుకునేవారికి ప్రేమికుల వారం ఒక వరమే. 

ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు జరిగే ఈ ప్రేమికుల వారం జంటల మధ్య విడదీయరాని బంధాన్ని బలపరుస్తుంది. 

ప్రేమికులకు ఎంతో ప్రియమైన వాలంటైన్ వీక్‌లో ప్రతిరోజు ఒక కొత్త అనుభూతే. 

  రకరకాల కార్యక్రమాలు ఈ వారంలో జరుగుతాయి. మరి వారం రోజులపాటు జరిగే ప్రేమ పండుగలోని ప్రత్యేకతలేంటో తెలుసా?

ఫిబ్రవరి 7 రోజ్ ​డే-  ప్రేమ వారంలో మొదటి రోజును అందమైన గులాబీతో ఆహ్వానిస్తారు.

ఫిబ్రవరి 8 ప్రపోజ్ డే- తమ ప్రియ సఖికి చెప్పాలనుకున్న ఎన్నో విషయాలను ఈరోజు వ్యక్తపరుస్తారు. ఎదలోతుల్లో ఏరులై పారుతున్న ప్రేమ ప్రవాహాన్ని గురించి వివరిస్తారు. 

ఫిబ్రవరి 9 చాక్లెట్ డే- ప్రేమికులు ఈ రోజున ఒకరికి ఒకరు చాక్లెట్లను ఇచ్చుకొని తమ ప్రేమను వ్యక్తపరుచుకుంటారు. 

 ఫిబ్రవరి 10 టెడ్డీ డే- అబ్బాయిలు తమ ప్రేయసిని ఆనంద పరచడానికి టెడ్డీలను బహుమతులుగా ఇస్తుంటారు. 

ఫిబ్రవరి 11 ప్రామిస్ డే- ఎల్లప్పుడూ ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని.. కలకాలం ప్రేమతో ఒకరికి ఒకరం తోడుగా ఉండాలని ప్రామిస్ చేసుకుంటారు. 

ఫిబ్రవరి 12 హగ్‌ డే- ఎన్ని బహుమతులిచ్చినా ప్రేమతో ఇచ్చే ఒక హగ్​.. వారిద్దరి మధ్య ప్రేమను మరింత పెంచుతుంది. 

ఫిబ్రవరి 13 కిస్​ డే- ముద్దు అనేది ఎనలేని ప్రేమకు సంకేతం. ఆ వ్యక్తిపై ఎంత ప్రేమ ఉందో ఒక ముద్దు తెలియజేస్తుంది. 

ఫిబ్రవరి14 వాలంటైన్స్ డే- ప్రేమికులు తమ ప్రేమను పండగలా జరుపుకునే రోజు.