ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేను జరుపుకుంటారు. అసలు ఈ ప్రేమికుల రోజును ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
క్రీ. శ 270 రోమ్‌లో వాలెంటైన్స్ అనే వ్యక్తి ఉండేవాడు. ఆయనకు ప్రేమ అంటే చాలా ఇష్టం.
వాలెంటైన్స్ యువతకు ప్రేమ సందేశాలు ఇవ్వడం, ప్రేమ వివాహాలను ప్రోత్సహించడం చేసేవాడు.
అదే సమయంలో రోమ్‌ను పాలిస్తున్న చక్రవర్తి క్లాడియస్ కుమార్తె వాలెంటైన్‌కు అభిమానిగా మారడంతో చక్రవర్తికి భయం పట్టుకుంది
దీంతో యువతకు ప్రేమ సందేశాలిచ్చి తప్పుడు దోవ చూపిస్తున్నాడన్న నెపంతో వాలెంటైన్‌కు మరణశిక్ష విధించి ఫిబ్రవరి 14న ఉరి తీయించాడు.
ఈ ఘటన జరిగిన రెండు దశాబ్దాల తర్వాత క్రీశ.496లో అప్పటి పోప్ గెలాసియన్స్ వాలెంటైన్ మరణించిన రోజును ప్రేమికుల రోజుగా ప్రకటించారు.
దీంతో అప్పట్నుంచి అందరూ ఆరోజుని ప్రేమికుల రోజుగా చేసుకుంటున్నారు.
ఏటా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమికులు తమకిష్టమైన కానుకలు ఇచ్చు పుచ్చుకుంటారు.