వింటర్ స్పెషల్ ఫ్రూట్‌గా మార్కెట్‌లో లభించే సీతాఫలాలకు క్రేజ్ ఎక్కువ.
సీతాఫలం ఎంత రుచిగా ఉంటుందో.. ఆరోగ్యపరంగా అంత మంచిది.
సీతాఫలాలతో పాటు వీటి ఆకులు కూడా ఔషధపరంగా అద్బుతమైనవి.
ఇందులో కాల్షియం, పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లతో పాటు చాలా పోషక గుణాలున్నాయి.
ఈ ఆకుల్లో ఉండే పొటాషియం, మెగ్నీషియం ఉంటుంది ఈ ఆకులతో టీ చేసుకుని తాగితే హార్ట్ ఎటాక్ ముప్పు తగ్గుతుంది.
సీతాఫలం ఆకుల్ని మిక్సర్ చేసి ఆ మిశ్రమాన్ని చర్మానికి రాసుకుంటే చర్మ సంబంధించ వ్యాధులు దూరమౌతాయి.
డయాబెటిస్ రోగులకు సీతాఫలం తింటే మంచిది కాదు కానీ.. సీతాఫలం ఆకులు మాత్రం చాలా ప్రయోజనకరం.
ఈ ఆకులతో టీ చేసుకుని తాగితే డయాబెటిస్ రోగులకు చాలా ప్రయోజనకరం.