తంగేడు చెట్టు అనగానే బతుకమ్మకు వాడే పువ్వులు గుర్తుకు వస్తాయి

తంగేడు ఒక ఔషధ మొక్క. దీని వృక్ష శాస్త్రీయ నామం కేషియా ఆరిక్యులేటా

ఈ మొక్కను మెరక తంగేడు, తంగేడు, తుంగేర, గొబ్బిపూలు అని అనేక పేర్లతో పిలుస్తారు

ఆయుర్వేదంలో మధుర, రూక్ష, పిత్త, వాత కఫ హర గుణాలున్నట్టు చెబుతున్నారు.

అతిమూత్ర వ్యాధి నియంత్రణకు ఎంతో ఉపయోగపడుతుంది

గుండె దడ తగ్గడం.. దానితో వచ్చే నీరసం, కళ్లు తిరగడం తగ్గిస్తుంది

తంగేడు ఆకులతో వీర్యవృద్ధి కలిగి, సంతానం కలుగుతుంది

మధుమేహ వ్యాధితో కలిగే అతిమూత్ర వ్యాధి నివారణకు దోహదం చేస్తుంది

పంటి నొప్పి తగ్గడానికి కాండం టూత్ బ్రష్ లాగా చేసి వాడితే ఎంతో మంచిది

మహిళల్లో తెల్లబట్ట వ్యాధి తగ్గటానికి దీని వేరు ఉపయోగపడుతుంది

గుప్పెడు పత్రాలు నీటిలో వేసి కషాయం కాచి ఆవిరి పడితే పార్శ్వపు తలనొప్పి మాయం

రేచీకటి తగ్గడానికి, రాత్రిపూట చూపు మెరుగుపడడానికి దోహదం చేస్తుంది

కడుపు నొప్పితో బాధపడే పిల్లలకు కాషాయం కాచి ఇస్తే తక్షణం ఉపశమనం

విరిగిన ఎముకలకు, పట్టుగా తంగేడు ఆకులు వాడతారు

నోటిపూతతో బాధపడేవారికి పత్రాలు నూరి మాత్రలుగా వాడితే పూత, పుండు తగ్గుతుంది