ఈరోజు సూర్యకుమార్ పుట్టినరోజు. బీసీసీఐ అతడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసింది
సూర్యకుమార్ సెప్టెంబర్ 14న 1990లో ఉత్తరప్రదేశ్‌లో జన్మించాడు
కుడిచేతి వాటంతో బ్యాటింగ్ చేయగల సూర్యకుమార్..
టీమిండియాలోకి రాకముందే ఐపీఎల్ ద్వారా తన సత్తా చాటుకున్నాడు
2010-11 రంజీ సీజన్ ద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు
2012లో ఐపీఎల్‌లో ముంబై టీమ్ కొనుగోలు చేసింది. కానీ ఒకే ఒక్క మ్యాచ్ ఆడగా డకౌట్ అయ్యాడు.
2014లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్ కొనుగోలు చేసింది. మూడేళ్ల పాటు ఆ జట్టుకే ఆడాడు.
2018లో మళ్లీ ముంబై ఇండియన్స్ టీమ్‌కు తిరగొచ్చాడు.
మార్చి 14, 2021న ఇంగ్లండ్‌తో టీ20 ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేశాడు.
నాలుగో స్థానంలో ఆడుతూ టీ20ల్లో సెంచరీ చేసిన ఐదో ఆటగాడు సూర్యకుమార్
అంతర్జాతీయ టీ20ల్లో ఆడిన తొలి బంతినే బౌండరీ దాటించిన తొలి భారత ఆటగాడు సూర్యకుమార్
సూర్యకుమార్ చేసిన అన్ని హాఫ్ సెంచరీల స్ట్రైక్ రేట్ 140కి పైగా ఉండటం విశేషం