మునగను ఆయుర్వేదంలో అమృతంలా పరిగణిస్తారు. ఎందుకంటే.. ఎన్నో వ్యాధుల్ని నయం చేస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచి.. జలుబు, జ్వరం వంటి జబ్బులు దరి చేరకుండా రక్షిస్తుంది.
క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల సయాటికా, కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఈ మునగకాయ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
కడుపు నొప్పి, గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది.
కంటి చూపు తగ్గుతున్న వారు మునగకాయలు, దాని ఆకులు తింటే.. ఎంతో మేలు జరుగుతుంది.
శరీరంలో రాళ్ల సమస్య ఉన్నవారు కచ్చితంగా మునగకూర, మునగ పులుసు తాగాల్సిందే.
శరీరంలోని బ్యాడ్ కొలెస్టిరాల్‌ని తగ్గించి, గుండె జబ్బులు దరిచేరకుండా కాపాడుతుంది.
మునగకాయ కూరను తరచుగా తింటే.. పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.
క్యాన్సర్ నుంచి కాపాడే లక్షణాలు.. ఈ మునగకాయలో పుష్కలంగా ఉంటాయి.
మునగకాయలో యాంటీ-డయాబెటిక్ లక్షణాలు..మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయి.
ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్.. మెదడుని ఆరోగ్యంగా ఉంచి, మెదడు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.