మొదటిసారి ప్రెగ్నెంట్ అయిన మహిళలకి ఒకేసారి కవలలు పుట్టాలని కోరుకుంటారు. ఇది సంతోషకరమైన విషయమే అయినప్పటికీ, కాస్తా రిస్క్.

కవలలని అల్ట్రాసౌండ్‌లో కవల పిల్లలని గుర్తించొచ్చు. ఈ సమయంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటి గురించి పూర్తిగా తెలుసుకోండి.

పిండంలో ఒకరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే hCG లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రెగ్నెంట్ అయినప్పుడు మీ బాడీ హ్యూమన్ కోరియోనిక్ గోనడోట్రోపిన్ (hCG) హార్మోన్‌ని ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. 

గర్భం మొదటి వారాల్లో దీని లెవల్స్ పెరుగుతాయి. కవలలు ఉంటే hCG స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. రక్తపరీక్ష ద్వారా ఈ hCG‌ని గుర్తించొచ్చు. ఇంటి పరీక్షలతో దీనిని గుర్తించలేం.  

ప్రెగ్నెన్సీ టైమ్‌లో గర్బధారణ లక్షణాలు సాధారణంగా హార్మోన్లలో మార్పుల వలన వస్తుంది. కాబట్టి, కవలలు ఉన్న గర్భిణీలు కూడా హార్మోన్ల మార్పులు ఉంటాయి.  

అసౌకర్యం, వికారం, వాంతులు వంటి మార్నింగ్ సిక్‌నెస్ ఉంటుంది. వీటితో పాటు..విపరీతమైన అలసట, తరచుగా మూత్ర విసర్జన, రొమ్ములు సున్నితంగా మారడం, ఆకలి పెరగడం, మానసిక సమస్యలు తెలెత్తుతాయి.

అధిక hCG స్థాయిల కారణంగా వారికి తీవ్రమైన మార్నింగ్ సిక్‌నెస్ ఉంటుంది. వికారం, వాంతుల సమస్య ఉంటుంది. ఒక బిడ్డ ఉన్నవారికంటే ఇద్దరు పిల్లలు ఉన్నవారికి వాంతులు ఎక్కువగా ఉంటాయి. 

అదే ఆడపిల్లలు అయితే మరింత ఎక్కువగా ఉంటాయి. బిడ్డ వల్ల పొట్ట పరిమాణం పెరుగుతుంది. అయితే కవలలు ఉన్నవారు త్వరగా బరువు, పొట్ట పరిమాణం పెరుగుతుంది. ఇలా కొన్ని లక్షణాలు ఉంటాయి.

అందరికీ ఇవే లక్షణాలు ఉండాలని ఏం లేదు. ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కోలా ఉంటుంది. దాని వల్ల వారి శరీరం స్పందిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే, ఏదేమైనా కూడా గర్భంతో ఉన్నప్పుడు ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

ఎప్పటికప్పుడు డాక్టర్‌ని సంప్రదించాలి. వారు మిమ్మల్ని పరీక్షించి ఎప్పటికప్పుడు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలనేది చెబుతుంటారు.అదే విధంగా, మంచి ఆహారం, కొద్దిపాటి వ్యాయామం, సరిపడా నిద్ర, తగినంత నీరు ఇవన్నీ కూడా కచ్చితంగా చేయాలి. 

డాక్టర్స్ సూచించిన ట్యాబ్లెట్స్ వాడాలి. అప్పుడే సుఖ ప్రసవం అవుతుంది. మీ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఏం తినాలి.. ఏం తినకూడదనే కచ్చితమైన డైట్ కూడా ఫాలో అవ్వాలి.