భారతీయ వంటకాలకు సంబంధించి తప్పనిసరిగా వాడే పదార్థాల్లో పసుపు కూడా ఒకటి. ఇది వంటకాల రంగు, రుచిని పెంచుతుంది.

ఇందులోని పోషకాలు ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా అందాన్ని కూడా మెరుగుపరుస్తాయి. అందుకే ఆయుర్వేదంలో కూడా పసుపును ఔషధంగా ఉపయోగిస్తారు.

కానీ అతి సర్వత్రా వర్జయేత్‌ అన్నట్లు పసుపును కూడా మితంగానే ఉపయోగించాలి. లేకపోతే కొన్ని ఆరోగ్య సమస్యలు తప్పవు. 

చాలా మందికి కిడ్నీలతో పాటు శరీరంలో తరచుగా రాళ్లు ఏర్పడుతుంటాయి. ఇలాంటి వారు వైద్యులను సంప్రదించిన తర్వాత పసుపును వినియోగించాలి. 

పసుపులో కర్కుమిన్ అనే మూలకం ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సంబంధించి పలు సమస్యలకు కారణమవుతుంది. ముఖ్యంగా పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల విరేచనాలు, వాంతులు కలగవచ్చు.

మధుమేహంతో బాధపడేవారు ఆహారం విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. పసుపును మితంగా తీసుకోవాలి.

 పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి ఐరన్ పూర్తిస్థాయిలో అందదు. అందువల్ల శరీరంలో ఐరన్‌ స్థాయులు తక్కువున్న వారు పసుపును తక్కువగా తీసుకోవాలి.

చాలా మంది తరచుగా ముక్కులో రక్తం పడుతుంటుంది. పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో వేడిమి పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ముక్కు నుంచి రక్త స్రావం మరింత ఎక్కువ కావొచ్చు.

కామెర్ల సమస్య ఉన్నవారు వీలైనంతవరకు పసుపుకు దూరంగా ఉండాలి. వారు దీన్ని తీసుకోవడం వల్ల ఈ సమస్య మరింత జఠిలమవుతుంది.