మరగించిన నీటిలో తులసి ఆకులు వేసి తాగితే.. మలేరియా, డెంగీ రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది

కాలేయ వ్యాధుల నివారణకు, కాలేయ పనితనాన్ని మెరుగుపరుచుటకు కావాల్సిన పోషకాలు తులసిలో పుష్కలంగా ఉంటాయి

తరచుగా ఉబ్బసానికి గురయ్యేవారు తులసి కషాయం తీసుకుంటే.. కొన్నాళ్లకు ఉబ్బసం రాదు

తులసి ఆకులను రాత్రి నీటిలో నానబెట్టి, ఆ నీటితో ఉదయం పళ్ళు తోముకుంటే.. నోటి దుర్వాసన, నోటిపొక్కులు తగ్గుతాయి

తులసి ఆకుల రసంలో ఒక చెంచా తేనె కలిపి తాగితే కఫం తగ్గుతుంది

కళ్ళు మంటలు, కళ్ళవెంట నీరు కారడంలాంటి సమస్యలతో బాధపడేవారు తులసి ఆకుల రసాన్ని దూదితో కను రెప్పల మీద రాస్తే మంచిది

తులసి రసం, ఉల్లిపాయరసం, అల్లం రసం, తేనె కలిపి తాగితే విరేచనాలు, రక్తవిరేచనాలు అరికడుతుంది

తుల‌సి ఆకులకు శ‌రీరంలో కొవ్వును త‌గ్గించే గుణం కూడా ఉంటుంది. మజ్జిగ‌తో తులసి ఆకులు క‌లిపి తీసుకుంటే బ‌రువు అదుపులో ఉంటుంది

నిద్రలేమితో బాధ‌పడేవారు తుల‌సి ఆకుల‌ను చ‌క్కెర‌తో క‌లిపి తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది

తుల‌సి ర‌సంలో తేనె క‌లిపి తీసుకుంటే.. చర్మ సమస్యలు దరి చేరవు. ఈ మిశ్రమంలో యాంటీ సెప్టిక్ గుణాలుంటాయి