ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటారు. కొంతమందికి ఇలాంటి ప్రయాణాలు ఆహ్లాదకరంగా ఉండవు.
చాలా మంది ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాంతులు, వికారం, తలతిరగడం వంటి సమస్యలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.
మనం ప్రయాణం చేసేటప్పుడు కొన్నిటిని దగ్గర పెట్టుకుంటే చాలు ఇలాంటి సమస్యలు రావు. వాటి గురించి చూద్దాం.
ప్రయాణం చేసేటప్పుడు అరటిపండును దగ్గర పెట్టుకుంటే అందులో పొటాషియం ఉంటుంది కనుక వాంతి రాకుండా చేస్తుంది. అందుచేతనే ప్రయాణం చేసేటప్పుడు అరటి పండు తినడం చాలా మంచిది.
నిమ్మకాయలలో ఎన్నో లక్షణాలు ఔషధ గుణాలు కూడా కలిగే ఉంటాయి. నిమ్మవల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
ప్రయాణాలలో వాంతులు వికారం వంటి సమస్యలు ఎదురైనప్పుడు నిమ్మకాయ రసాన్ని లేదా నిమ్మకాయను వాసన చూస్తే చాలు వాంతులు, వికారం వెంటనే తగ్గిపోతాయి.
మన వంటింట్లో దొరికేటువంటి వాటిలో అల్లం కూడా ఒకటి. మనం ప్రయాణం చేస్తున్న సమయాలలో వాంతులు ఎక్కువగా వస్తున్నట్లు అయితే అల్లం చాలా ఉపయోగపడుతుంది.
ప్రయాణం చేసేటప్పుడు అల్లంను కొంచెం నోట్లో వేసుకున్నట్లయితే తక్షణ ఉపశమనం కలుగుతుందట.
లేదంటే ఏదైనా అల్లంతో చేసిన పదార్థాలను తిన్నా కూడా సరిపోతుంది.