పెళ్ళి చేసుకుంటే అప్పటి వరకూ ఉన్న ఫ్రీడమ్ పోతుంది. పార్టీలు, ప్రైవసీ ఉండదని కొంతమంది మగవారు అంటారు. అందుకే పెళ్ళి అంటేనే భయపడతారు.
అయితే, ఇందుకు భిన్నంగా కొంతమంది పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.
డబ్బు ఆదా..
ఒంటరి మగవారికి పొదుపు అంతగా ఉండదు. వివాహమయ్యాక మగవారు పొదుపు చేయడం నేర్చుకుని డబ్బుని ఎక్కువగా సంపాదిస్తారు. ఇలాంటి వాటి కోసం పెళ్ళి చేసుకోవాలనుకుంటారు.
లైఫ్‌స్టైల్..
పెళ్ళి చేసుకుంటే సంఘంలో తనకంటూ ఓ గౌరవం పెరుగుతుందని, అందరి ముందు ఆ హోదా కోసం మగవారు పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. ఈ పెళ్ళి బంధంతో సంఘంలో గౌరవంగా ఉండాలనుకుంటారు.
కుటుంబం కోసం..
ఆడవారు పిల్లల్ని దత్తత తీసుకుని సింగిల్ పేరెంట్‌గా ఉండగలరు. కానీ, మగవారు అలా చేయలేరు.
కుటుంబం కోసం..
అందుకే, తమకంటూ ఓ కుటుంబం కోసం పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. పిల్లల్ని, కుటుంబాన్ని ఇష్టపడేవారు కచ్చితంగా పెళ్ళి చేసుకోవాలనుకుంటారు.
కుటుంబ సభ్యుల కారణంగా..
చాలా మంది మగవారు కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా మ్యారేజ్ చేసుకుంటారు.
కుటుంబ సభ్యుల కారణంగా..
వారికి ఇష్టం లేకపోయినా కేవలం వారికోసమే పెళ్ళి చేసుకుంటారు.
కుటుంబ సభ్యుల కారణంగా..
ఒత్తిడితో మ్యారేజ్ చేసుకున్నవారు ఆ తర్వాత జీవితాన్ని ఎంజాయ్ చేయలేరు.
ప్రేమ కోసం..
మగవారు ప్రేమని కోరుకుంటారు. ప్రేమతో ఒకరు జీవితాంతం తోడుగా ఉండాలని పెళ్ళి చేసుకోవాలనుకుంటారు.
ప్రేమ కోసం..
ఒంటరిగా ఉండడం ఇష్టం లేని వారు పెళ్ళికి ఒప్పుకుంటారు.