Success లో ఏ ఎదవైనా నవ్వుతాడు, Failure లో నవ్వే వాడే హీరో. -- చిరునవ్వుతో

కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యతలు లేని యవ్వనం, జ్ఞాపకాలు లేని వృద్ధాప్యం అనవసరం -- తీన్ మార్

యుద్ధంలో గెలవటం అంటే శత్రువుని చంపటం కాదు.. శత్రువును ఓడించటం. ఓడించటమే యుద్ధం యొక్క లక్షణం.. చంపటం కాదు--- జల్సా

మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు ---సన్ ఆఫ్ సత్యమూర్తి

బాగుండడం అంటే బాగా ఉండటం కాదు. నలుగురితో ఉండటం, నవ్వుతు ఉండటం - అత్తారింటికి దారేది

మనం గెలిచినపుడు చప్పట్లు కొట్టేవాళ్లు, మనం ఓడినపుడు భుజం తట్టేవాళ్లు నలుగురు లేనప్పుడు.. ఎంత సంపాదించినా.. పోగొట్టుకున్నా.. తేడా ఏమి ఉండదు. --- నువ్వు నాకు నచ్చావ్

మనం నమ్మగలిగేవి మాత్రమే నిజాలు, భరించలేనివి అన్నీ అబద్ధాలు ఐతే బాగుండేది అమ్మా-- నువ్వే నువ్వే

యుద్ధం చేసే సత్తా లేనోడికి శాంతి అడిగే హక్కు లేదు-- అరవింద సమేత

అందంగా లేదని అమ్మని కోపంగా ఉన్నాడని నాన్నను వదిలేయలేం కదా-- తీన్ మార్

తెగిపోయేటప్పుడే దారం విలువ తెలుస్తోంది.. విడిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తోంది-- అత్తారింటికి దారేది

తాజ్ మహల్, చార్మినార్ , నాలాంటి కుర్రాళ్లు.. చూడడానికే కొనడానికి పనికిరారు-- నువ్వే నువ్వే

దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది సార్. ఒకటి నేలకి, రెండు ఆడవాళ్ళకి. అలాంటి వాళ్ళతో మనతో గొడవ ఏంటి సార్. JUST SURRENDER అయిపోవాలంతే-- అల వైకుంఠపురంలో 

లాజిక్ లు ఎవరు నమ్మరు అందరికి మ్యాజిక్ కావాలి అందుకే మనకి సైంటిస్ట్లు కంటే బాబాలు Famous--  జులాయి

అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరూ గుర్తించలేరు.. జరిగిన తర్వాత ఎవ్వరూ గుర్తించాల్సిన అవసరము లేదు నువ్వే మా దేవుడని నువ్వు నమ్మే పని లేదు, మాకు నమ్మించే అక్కర లేదు.. సామీ.. ఇది ని దర్శనం, ఇది నిదర్శనం.-- ఖలేజా