ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చుసిన యానిమల్ మూవీలో జోయా పాత్రలో మెప్పించిన తృప్తీ డిమ్రీ గురించి చర్చించుకుంటున్నారు.

కథలో ట్విస్ట్ కు కారణమైన ఈ నటి ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నారు. బోల్డ్ సీన్ లో నటించిన ఈ నటి తన నటనతో ఆకట్టుకున్నారు. ఈ నటి ఎవరంటే?

బాలీవుడ్ కి చెందిన తృప్తీ మొదటి సినిమా పోస్టర్ బాయ్స్ అనే  కామెడీ చిత్రం  (2017)లో తొలిసారిగా నటించింది.

హీరోయినిగా రొమాంటిక్ డ్రామా లైలా మజ్ను (2018)లో ఆమె మొదటి ప్రధాన పాత్రను పోషించింది.

ఈమె 2021లో ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా 50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్ట్ ఆఫ్ 2020లో ఆమె 20వ స్థానంలో నిలిచింది.

2020లో ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డులలో ఆమెకు వెబ్ ఒరిజినల్ ఫిల్మ్‌లో ఉత్తమ నటి పురస్కారం దక్కింది.

అయితే యానిమల్ తర్వాత తృప్తి కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాలిన అవసరం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

చాలా మంది మన తెలుగు నిర్మాతలు రాబోయే చిత్రాలలో మహిళా ప్రధాన పాత్రల కోసం త్రిప్తి డిమ్రీని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నారు

యానిమల్ సినిమాతో తృప్తీ భట్ రెమ్యునరేషన్ కూడా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇకపై వరుస ఆఫర్లతో ఈ బ్యూటీ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.