ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన టాప్ 10 నగరాలు గురించి తెలుసుకుందాం..
10: జపాన్ దేశంలోని ఒసాకా ప్రాంతం 2024లో సుమారు 19 మిలియన్ల జనాభాతో పదో స్థానంలో నిలిచింది.
09: భారత్ ఆర్థిక రాజధాని ముంబై 2024లో సుమారు 21.7 మిలియన్ల జనాభాను కలిగి ఉంది.
08: చైనాలోని బీజింగ్‌లో 2024లో దాదాపు 22.2 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారు.
07: మెక్సికో సిటీలో 2024లో సుమారు 22.5 మిలియన్ల జనాభా ఉన్నారు.
06: ఈజిప్ట్ రాజధాని కైరో సుమారు 22.6 మిలియన్ల జనాభా.
05: బ్రెజిల్‌లోని అతిపెద్ద నగరమైన సావో పాలో, 2024లో దాదాపు 22.8 మిలియన్ల మంది నివాసితులను కలిగి ఉంది.
04: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో సుమారుగా 23.9 మిలియన్ల జనాభా ఉన్నారు.
03: చైనాలోని షాంఘైలో 2024లో దాదాపు 29.9 మిలియన్ల నివాసితులున్నారు.
02: భారత్ రాజధాని ఢిల్లీలో సుమారు 33.8 మిలియన్ల జనాభా ఉంది.
01: జపాన్‌లోని టోక్యో 37.1 మిలియన్ల జనాభాతో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.