ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ముంబై: దీనిని 1878లో ప్రారంభించారు. 10 సంవత్సరాల పాటు నిర్మించారు.

ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం: ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో సేవలందిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయం.

లోహగడ్ కోట: దీనిని 1648 ADలో శివాజీ స్వాధీనం చేసుకున్నాడు. అయితే.. అతను 1665 ADలో పురందర్ ఒప్పందం ప్రకారం మొఘలులకు లొంగిపోయాడు.

విజయదుర్గ్ కోట: ఈ కోటను 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ స్వాధీనం చేసుకున్నారు.

సింహగడ్ కోట: పూర్వం దీనిని కొండనా అని పిలిచేవారు. ఇది అనేక యుద్ధాలకు వేదికగా ఉంది.

టోర్నా కోట: 16 ఏళ్ల వయస్సులో శివాజీ సాధించిన మొదటి కీలకమైన విజయం కాబట్టి.. ఈ కోటకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

రాయ్ఘడ్ కోట: ఇది 1674లో మరాఠా సామ్రాజ్యానికి రాజధాని. శివాజీకి అధికార కేంద్రంగా పని చేసింది.

శివనేరి కోట: శివాజీ జన్మస్థలం.. ఈ కోటకు అపారమైన సెంటిమెంట్ విలువ ఉంది.