మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 5 బీర్ల గురించి తెలుసుకుందాం.. 

 దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బీర్‌లో 2%తో బడ్‌వైజర్ 5వ స్థానాన్ని ఆక్రమించింది.

కళ్యాణి బ్లాక్ లేబుల్ బీర్ విక్రయాల్లో 2.7 శాతంతో 4వ స్థానంలో నిలిచింది.  

ఈ బ్రాండ్ పశ్చిమ బెంగాల్‌తో పాటు కొన్ని తూర్పు రాష్ట్రాల్లో అమ్ముడవుతోంది. 

 ప్రపంచవ్యాప్తంగా టాప్ 5 బ్రూయింగ్ కంపెనీలలో ఒకటైన SABMiller..150 బీర్ల రకాల బీర్లను తయారు చేస్తుంది.  

 SABMiller.. అత్యధిక కిక్ ఇచ్చే "నాక్ అవుట్" బ్రాండ్ బీర్‌ను కూడా ఉత్పత్తి చేస్తుంది. ఇది 3వ స్థానంలో ఉంది. బీర్లు అమ్మకాల్లో నాక్ అవుట్ 8.7 శాతం. 

  SABMiller సంస్థ యొక్క మరొక బ్రాండ్..  హేవర్డ్స్ దీనికి పేదవారి పానీయం అని పేరుంది.  

ఈ బీర్‌లో హేవర్డ్స్ బ్రాండ్ బీర్ 2వ స్థానంలో 15 శాతం మార్కెట్‌ను కలిగి ఉంది.  

  మొదటి స్థానంలో "కింగ్‌ఫిషర్ బ్రాండ్" నిలిచింది. ఈ బీర్ దేశంలో అత్యధికం (41 శాతం)గా అమ్ముడవుతుంది.