స్టాట్యూ ఆఫ్ యూనిటీ - 182 మీటర్లు ఈ విగ్రహం భారతదేశంలోని గుజరాత్‌లో ఉంది. దీని నిర్మాణం 2018లో పూర్తయింది.

స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ - 128 మీటర్లు ఇది చైనాలోని హెనాన్‌లో ఉంది. 2008లో దీని నిర్మాణం పూర్తయింది.

లైక్యున్ సెక్కియా - 115.8 మీటర్లు ఇది మయన్మార్‌లోని సాగింగ్ డివిజన్‌లో ఉంది. దీనిని 2008లో ఏర్పాటు చేశారు.

బిలీఫ్ విగ్రహం - 106 మీటర్లు ఇది భారతదేశంలోని రాజస్థాన్‌లో ఉంది. దీనిని 2020లో ఆవిష్కరించారు.

ఉషికు దైబుట్సు - 100 మీటర్లు ఇది జపాన్‌లోని ఉషికు నగరంలో ఉంది. ఈ విగ్రహం 1993లో నిర్మించబడింది.

సెండాయ్ దైకన్నోన్ - 100 మీటర్లు 1991లో ఈ విగ్రహం ఆవిష్కరించారు. ఇది జపాన్‌లోని మియాగి ప్రిఫెక్చర్‌లో ఉంది.

గుయిషన్ గ్వాన్యిన్ - 99 మీటర్లు ఈ విగ్రహం చైనాలోని హునాన్‌లో ఉంది. 2009లో దీనిని ఆవిష్కరించారు.

గ్రేట్ బుద్ధ ఆఫ్ థాయిలాండ్ - 92 మీటర్లు ఈ బుద్ధ విగ్రహం థాయ్‌లాండ్‌లోని ఆంగ్ థాంగ్‌లో ఉంది. దీనిని 2008లో ఆవిష్కరించారు.

హొక్కైడో డైకన్నోన్ - 88 మీటర్లు 1989 సంవత్సరంలో ఈ విగ్రహం నిర్మితమైంది.  ఇది జపాన్‌లోని హక్కైడోలో ఉంది.

ది మదర్ ల్యాండ్ కాల్స్ - 85 మీటర్లు ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళ విగ్రహం. ఇది 1967లో ఆవిష్కరించబడింది. ఇది రష్యాలోని వోల్గోగ్రాడ్‌లో ఉంది.