దేశంలోని 10 మోస్ట్ హాంటెడ్ ప్రాంతాలు

ఆగ్రాసెన్‌కి బావోలీ: ఢిల్లీలో ఉండే ఈ బంగళాలో భయానక శబ్దాలు వినిపిస్తాయట. అలాగే రాత్రివేళల్లో తెల్లచీరలో ఎవరో తిరుగుతున్నట్లు కనిపిస్తుందట!

ఆలేయ ఘోస్ట్ లైట్స్: పశ్చిమ బెంగాల్ ఉన్న ఈ అడవిలో రాత్రివేళ కొన్ని కొన్ని ప్లేసుల్లో లైట్లు వెలుగుతున్నట్టు కనిపిస్తుంది

భంగ్రా ఫోర్ట్: ఇది రాజస్థాన్‌లోని ఆల్వార్ జిల్లాలో ఉంది. ఈ హాంటెడ్ ప్రదేశం గురించి అనేక కథలు ఉన్నాయి

డిసౌజా చౌల్ ఆఫ్ మాహిమ్: ముంబైలో ఉండే ఈ ప్రాంతంలో రాత్రివేళల్లో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయట. అందుకే అక్కడికి వెళ్లడానికి ఎవ్వరూ సాహసించరు

డుమాస్ బీచ్: గుజరాత్‌లో ఉండే ఈ బీచ్‌కు సూర్యాస్తమయం తర్వాత సందర్శించడానికి వీల్లేదు. ఎందుకంటే.. అనేక మిస్సింగ్ కథలు ఉన్నాయి

డౌ హిల్: ఇది పశ్చిమ బెంగాల్‌లో ఉండే ఓ భయానక ప్రాంతం. ఇక్కడ తల లేని ఒక దేహం సంచరిస్తుంటుందని కథనాలున్నాయి

ఢిల్లీ కంటోన్మెంట్: ఢిల్లీలోని మోస్ట్ హాంటెడ్ ప్రదేశాలలో ఒకటి. రాత్రిపూట తెలుపు చీరలో దెయ్యాలు కనిపిస్తాయని, లిఫ్ట్ కూడా అడుగుతాయని కథలున్నాయి

శనివర్వాడ కోట: ఇది పూనేలో ఉంది. ఈ కోటలో 13 ఏళ్ల బాలుడ్ని నమ్మకద్రోహంతో కిరాతకంగా చంపారట. అతడి ఆత్మే అక్కడ సంచరిస్తుంటుందట!

టన్నల్ నం.103: ఇది షిమ్లా వెళ్లేదారిలో వుంది. దీనిగుండా వెళ్తున్నప్పుడు దీని సృష్టికర్త కలనల్ బారోగ్ రూపం కనిపిస్తుందని ప్రయాణికులు చెప్తుంటారు

బ్రిజ్ భవన్ ప్యాలెస్: రాజస్థాన్‌లో ఉండే ఈ కోటలో.. చంద్రముఖి సినిమా మాదిరే ఓ లేడీ దెయ్యం సంచరిస్తున్నట్లు ఇక్కడి జనాలు చెప్తుంటారు