ఖర్దుంగ్‌లా పాస్ (khardungla pass) లదాఖ్ నుంచి నుబ్రా వాలీకి చేరడానికి ఇదొక్కటే మార్గం. దీన్ని వరల్డ్‌లోనే అత్యంత ఎత్తులో ఉన్న రోడ్డు మార్గంగా (18,380 అడుగులు) ప్రకటించారు.

శ్రీశైలం ఘాట్ రోడ్  (srisailam ghat road) దీనికి దెయ్యాల మలుపు అనే పేరుంది. ఇక్కడ నిత్యం, ముఖ్యంగా మలపుల వద్ద యాక్సిడెంట్‌లు జరుగుతుంటాయి.

ముంబాయ్-పూణే ఎక్స్‌ప్రెస్‌వే  (Mumbai - Pune Expressway) దట్టమైన పశ్చిమ కనుమల్లో ఉన్న ఈ మార్గంలో అప్పుడప్పుడు కొండ చరియలు విరిగి పడుతుంటాయి.

కిల్లార్-కిష్త్వార్ రోడ్డు  (killar kishtwar road) జమ్ము & కశ్మీర్‌లోని ఈ రహదారిని, పెద్ద కొండల మధ్య చిన్న పాయగా నిర్మించారు.

గటా లూప్స్ (gata loops) లేహ్-మనాలి మార్గంలో ఉన్న ఈ రోడ్డుకి ‘ఆత్మల రహదారి’గా పేరుంది. ఈ ప్రాంతంలో ఒక ఆత్మ సంచరిస్తుందని అంటారు.

త్రీ లెవెల్ జిగ్‌జాగ్ రోడ్డు  (3 level zigzag road) సిక్కింలో ఉన్న ఈ రోడ్డు.. 30 కి.మీ. పొడవు, 100 మలుపులు కలిగి ఉంటుంది.

జోజిలా పాస్ (zojila pass) ఇది జమ్ము & కశ్మీర్‌లో ఎత్తైన పర్వత మార్గం. సముద్రమట్టానికి 3500 మీటర్ల ఎత్తులో ఉంటుంది.

తిరుపతి ఘాట్ రోడ్డు  (Tirupati Ghat Road) ఈ ఘాట్ రోడ్ గుండా ప్రమాదకరమైన మలుపులున్నాయి. ఆదమరిస్తే పెను ప్రమాదం తప్పదు.

నాతులా పాస్ (nathula pass) సిక్కిం - చైనా టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో ఉంది. ఇది సముద్రమట్టానికి 14000 అడుగుల ఎత్తులో ఉంటుంది.

కిన్నౌర్ రహదారి (kinnaur road) ఇది హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. సముద్రమట్టానికి 4000 అడుగుల ఎత్తులో ఉండే ఈ రహదారిలో కొండ చరియలు విరిగిపడే ప్రమాదముంది.