చిరంజీవి: ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోగా చెప్పబడుతున్న మెగాస్టార్ చిరంజీవి నర్సాపూర్ వైయస్ కాలేజ్ లో కామర్స్ లో డిగ్రీ చేశారు.
నందమూరి బాలకృష్ణ: ఫ్యాక్షన్ సినిమాలకు కేరాఫ్ నందమూరి నటసింహం హైదరాబాద్ లోని నిజాం కాలేజ్ లో డిగ్రీ పూర్తి చేశారు.
అక్కినేని నాగార్జున: లవ్ స్టోరీస్, ఆధ్యాత్మిక సినిమాలకు కేరాఫ్ గా నిలిచిన నాగార్జున అమెరికాలోని ఈస్టర్న్ మిచిగాన్ యూనివర్సిటీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేశారు.
దగ్గుబాటి వెంకటేష్: ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎంతో ఇష్టమైన వెంకటేష్ అమెరికాలో చదువుకున్నాడు. అమెరికాలోని మోంటేరే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్డడీస్ లో ఎంబీఏ పూర్తి చేశారు.
జూనియర్ ఎన్టీఆర్: నందమూరి నట వారసుడిగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ లోని సెయింట్ మేరీస్ కాలేజ్ లో చదువుకున్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్: తెలుగు సినీ ఇండస్ట్రీలో తిరుగులేని ఫాలోయింగ్ సొంతం చేసుకున్న పవర్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు.
మహేష్ బాబు: సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబు చెన్నైలోని లయోలా కాలేజ్ లో హానర్స్ డిగ్రీ ఆఫ్ కామర్స్ పూర్తి చేశారు.
ప్రభాస్: బాహుబలి సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ బి టెక్ వరకు చదువుకున్నారు.
అల్లు అర్జున్: స్టైలిష్ స్టార్ అయిన అల్లు అర్జున్ హైదరాబాద్ లోని ఎమ్మెస్ఆర్ కాలేజ్ లో బ్యాచ్‌లర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు.
రామ్ చరణ్: మెగాపవర్ స్టార్ గా కొనసాగుతున్న రాంచరణ్ కూడా ఫారెన్ లో చదువుకున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో డిగ్రీ పూర్తి చేశారు.
నితిన్: మంచి సినిమాలతో దూసుకెళుతున్న నితిన్ బిటెక్ వరకు చదువుకున్నారు.
విజయ్ దేవరకొండ: తెలుగు సినీ ఇండస్ట్రీలో రౌడీగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ బి కామ్ పూర్తి చేశారు.