కృష్ణంరాజు పూర్తి పేరు  ఉప్పల‌పాటి వెంక‌ట కృష్ణంరాజు 1940 జ‌న‌వ‌రి 20న జ‌న్మించారు.

తండ్రి ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ రాజు, తల్లి లక్ష్మీదేవి, హైదరాబాద్‌ బద్రుకా కాలేజీ ఆఫ్‌ కామర్స్ నుండి బీకాం పట్టా

కృష్ణంరాజు భార్య పేరు శ్యామలాదేవి,  కూతుర్లు.. సాయి ప్రసీధ,  సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప్తి

200పైగా చిత్రాల‌లో న‌టించిన కృష్ణంరాజు, తొలి చిత్రం `చిల‌క‌-గోరింక‌` (1966)

కృష్ణంరాజు 100వ చిత్రం `శివ‌మెత్తిన స‌త్యం`, హీరోగా బ్రేక్ నిచ్చిన చిత్రం `కృష్ణవేణి`

కృష్ణంరాజుకు స్టార్ డ‌మ్ సంపాదించిన సినిమా `భ‌క్త క‌న్నప్ప`, `రెబ‌ల్ స్టార్`గా నిలిపిన `క‌ట‌క‌టాల రుద్రయ్య`

`అమ‌ర‌దీపం`తో ఉత్తమ న‌టుడుగా నందిని అందుకున్న తొలి న‌టుడు కృష్ణంరాజు, `బొబ్బిలిబ్రహ్మన్న`తో రెండో నంది అందుకున్నారు

కొన్ని చిత్రాల‌లో విల‌న్ వేషాలు వేసిన కృష్ణంరాజు, 2014 ర‌ఘుప‌తి వెంక‌య్య అవార్డుకు ఎంపికైన కృష్ణంరాజు

కృష్ణంరాజు త‌మ్ముడు ప్రముఖ నిర్మాత  యు. సూర్యనారాయ‌ణ రాజు ఆయన కొడుకు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్

 కాంగ్రెస్, బీజేపీ, ప్రజారాజ్యం పార్టీల‌లో ఉన్న కృష్ణంరాజు.. ప్రస్తుతం బీజేపీలో కొన‌సాగుతున్నారు.

1999లో న‌ర‌సాపురం లోక్ స‌భ నుంచి ఎన్నికైన కృష్ణంరాజు. కేంద్రమంత్రి గానూ ప‌నిచేశారు.

కృష్ణంరాజు చివ‌రి చిత్రం `రాధే శ్యామ్`.. 

1940 జ‌న‌వ‌రి 20 - 2022 సెప్టెంబర్‌ 11