తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం జూన్ 24న రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్ కోటాను విడుదల చేయనుంది. మంగళవారం ఉదయం 10 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ ఆర్జిత సేవా టికెట్లు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. 

జూన్ 20న ఉదయం 10 గంటల వరకు టికెట్ల నమోదుకు టీటీడీ అవకాశం కల్పించింది. ఆ రోజున మరిన్ని టికెట్లు విడుదల చేయనుంది.

జూన్ 21న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్ల విడుదల 

జూన్ 22న ఉదయం 10 గంటలకు అంగప్రదిక్షిణ టోకెన్లు విడుదల

జూన్ 22న ఉదయం 11 గంటలకు శ్రీవాణి టికెట్లు విడుదల 

జూన్ 22న మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శన టోకెన్లు విడుదల 

జూన్ 24న రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదల