ఒత్తిడి.. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరు ఎదురుకుంటున్న సమస్య ఇది.
పిల్లలు చదువుల కోసం ఒత్తిడి అవుతే పెద్ద వాళ్ళు ఇంటి పనులు, ఆఫీస్ పనుల వల్ల ఒత్తిడికి గురవుతున్నారు.
ఈ ఒత్తిడి వల్ల కనిపించే రోగాలే కాదు కంటికి కనిపించని ఎన్నో రోగాలు మనిషికి వస్తున్నాయ్.
అయితే పిల్లల్లో ఒత్తిడి ఉండకూడదు అంటే వారికీ చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యమే.
ఉదయం లేవగానే ఒక 20 నిమిషాల పాటు వారిని నడిపించడం.. మంచి పౌష్టికాహారం ఇవ్వడం వల్ల ఈ ఒత్తిడి చాలా తగ్గుతుంది.
ఒత్తిడి వల్ల త్వరగా అలసిపోవడం, మధుమేహం, గుండె సమస్యలు, నిద్రలేమి సమస్య, తలనొప్పి, అధికబరువు, డిప్రెస్సన్, సప్రెషన్ వంటివి వస్తాయి.
తప్పినిసరిగా టిఫిన్ తినాలి. అప్పుడే బలంగా ఉండి రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు.
ఒత్తిడి తగ్గాలంటే.. శరీరానికి తగ్గ వ్యాయామాలు చెయ్యడంతో పాటు మంచి పుష్టికాహారం తీసుకోవాలి.
రోజులో ఖచ్చితంగా మనం తీసుకొనే ఆహారంలో ముప్పై శాతం పండ్లు తినాలి.
అప్పుడే బలంగా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా స్ట్రెస్ ను జయిస్తాం.