పండగ సమయంలో స్వీట్లు, ప్రత్యేక వంటలను తెగలాగిస్తుంటాం.

పండగ వేళల్లో ఎంతోకొంత బరువు పెరుగుతుంటాం.

బరువు పెగకుండా ఈ నియమాలు పాటిస్తే చాలు. 

వ్యాయామాన్ని మానకూడదు కనీసం 20 నిమిషాలు వ్యాయామం చేయాలి.  డ్యాన్స్, రన్నింగ్, వాకింగ్, యోగా వంటివి చేయాలి.

డాన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. పండగ సమయాల్లో డ్యాన్స్ వల్ల బరువు నియంత్రించుకోవచ్చు.

తేనెను వాడాలి. వంటల్లో, స్వీట్ల తయారీలో చక్కెరకు బదులు తేనెను వాడాలి.

నిమ్మరసం, కొబ్బరి నీటిని తాగాలి. కూల్ డ్రింక్స్, ఆల్కాహల్ లో కేలరీలు ఎక్కువ. వీటికి బదులు నిమ్మరసం, కొబ్బని నీరు మంచివి.

తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాలి. తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు ఆహారం తీసుకుంటే బరువు నియంత్రణలో ఉంటుంది.

నెమ్మదిగా తినాలి. నెమ్మదిగా, పూర్తిగా నమిలి మింగడం ద్వారా బరువును కంట్రోల్ చేసుకోవచ్చు.