కొంతమంది అమ్మాయిలకు ఉంగరాల కురులంటే చాలా ఇష్టం.

కానీ ఆ ఉంగరాల కురులను మెయింటైన్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు.

చూడడానికి ఎంత అందంగా ఉంటాయో.. అంతకంటే ఎక్కువ సమస్య ఉంటుంది.

ఉంగరాల జుట్టు లేటుగా పెరుగుతుంది. జుట్టు పొడిగా ఉంటుంది.

వెంట్రుకల చివర్లలో పగుళ్లు వస్తాయి. దీనికి పరిష్కారం ఏంటో తెలుసుకుందాం..

వారానికోసారి పెరుగు, నిమ్మరసం, మందారం, మెంతుల పేస్ట్ల మిశ్రమాన్ని తలకి పట్టించాలి

 ఒక గంట తరువాత చల్లటి నీటితో స్నానం చేసి, కండీషనర్ను తలకు అప్లైయ్ చేయాలి.

ఇలా చేయడం వలన కురుల చివర్లలో చిక్కులు, పగుళ్లు రాకుండా ఉంటాయి.

6 నుండి 8 వారాలకోసారి కురుల చివర్లను కత్తిరించుకోవాలి.