ప్రధాన పోటీ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో విద్యార్థులు పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రిపరేషన్ కావడానికి సమయం తక్కువగా ఉంది.

పూర్తి సిలబస్‌ చదవడానికి సరైన ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా టైం మేనేజ్‌మెంట్ టెక్నిక్స్, సరైన షెడ్యూలింగ్‌తో పరీక్షలకు సన్నద్ధమైతే మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంది. వీటితో పాటు మరికొన్ని టిప్స్ పాటిస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు.

ప్లానింగ్ అండ్ టైం మేనేజ్‌మెంట్..  ప్రిపరేషన్‌కు సరైన ప్రణాళికలు వేసుకోవాలి. దీంతో పాఠ్యాంశాల్లో వేటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలో తెలుస్తుంది. వాటికి అనుగుణంగా సమయం కేటాయించడానికి వీలు కలుగుతుంది.

మైండ్ మ్యాపింగ్..  మనం చదివే అంశాన్ని విజువల్ రూపంలో గుర్తుకు తెచ్చుకునే విధంగా చేయడమే మైండ్ మ్యాపింగ్. 3 నుంచి 6 నెలల పాటు మ్యాప్ మ్యాపింగ్ ప్రక్రియను ఉపయోగించడం వల్ల సంక్లిష్ట పాఠాలను గుర్తించుకోవచ్చు.

ఫేన్‌మాన్ టెక్నిక్..  ప్రాథమికంగా పాఠాలను విడగొట్టి ఎక్కడ మనకు అర్థం కావడం లేదో గుర్తించి వాటిని పరిష్కరించడమే ఫేన్‌మాన్ టెక్నిక్ ఉద్దేశం.

ఫ్లాష్ కార్డ్స్..  తక్కువ సమయంలో ఎక్కువ కాన్సెప్ట్‌లు గుర్తుంచుకోవడానికి ఈ పద్దతి బెస్ట్. దీన్ని ఉపయోగించి మనకు మనమే టెస్ట్ చేసుకోవచ్చు

కార్నెల్ నోట్‌టేకింగ్ సిస్టమ్..  పాఠాలు వినే సమయంలో నోట్ పక్కన ఖాళీ కాలమ్‌ను ఉంచుతూ యాక్టివ్ నోట్-టేకింగ్‌ను ప్రోత్సహిస్తుంది. ఈ కాలమ్ వల్ల తరువాత మరోసారి సమాచారాన్ని గ్రహించడానికి, తిరిగి రివైజ్ చేసుకోవడానికి స్వయంగా విద్యార్థులే టెస్ట్ చేసుకోవచ్చు.